నవతెలంగాణ – సదాశివనగర్
గాంధీభవన్లోని ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ ఆధ్వర్యంలో ఎస్సీ విభాగం స్టేట్ ఎగ్జిక్యూటివ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ విభాగం జాతీయ అధ్యక్షులు రాజేంద్రపాల్ గౌతమ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ విభాగం స్టేట్ కమిటీ 33 జిల్లాల ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులతో పాటు ఎస్సీ విభాగం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మద్దెల బాగయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు 33 జిల్లాల జిల్లా అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్ మండల గ్రామాల ఎస్సీ విభాగాల అధ్యక్షులు పటిష్టంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు కోసం కష్టపడ్డ పని తీరును వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రజా పాలనలో ఎన్నో పథకాలలో భాగంగా ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా నా దళిత కుటుంబాల సోదరులకు అర్హులైన వారికి అందుతున్నాయని ఆయనకు వివరించారు. అదేవిధంగా కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ప్రభుత్వం గుర్తించి రానున్న స్థానిక ఎలక్షన్లలో పార్టీ బీ ఫామ్ ఇప్పించి పోటీ చేసేందుకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలన్నారు .అదేవిధంగా అర్హులైన కార్యకర్తలకు స్టేట్ కమిటీలో నామినేటెడ్ పోస్టులు ఇప్పించాలని జాతీయ అధ్యక్షులకు వివరించారు. మీ ద్వారా ఈ సమాచారాన్ని సీఎం గారి దగ్గరికి తీసుకెళ్లి ఎస్సీ విభాగం నాయకులకు కార్యకర్తలకు న్యాయం చేయాలని అన్నారు. రానున్న స్థానిక ఎలక్షన్లో ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వం చేస్తున్న ప్రజా పాలన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక ఎన్నికలలో విజయం సాధించే దిశగా కష్టపడాలని సూచించారు.
స్టేట్ ఎగ్జిక్యూటివ్ సమావేశం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES