Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుపంటపొలంలో భారీ కొండచిలువ

పంటపొలంలో భారీ కొండచిలువ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని బిజ్జల్ వాడీ గ్రామంలోని ఓ రైతు పొలం ఓర్రేలో కొండచిలువ దాక్కుంది. ఇది చూసిన రైతు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. రైతు షేక్ ముజీబ్ తెలిపిన వివరాల ప్రకారం.. రైతు వ్యవసాయ భూమి గుట్ట పక్కన ఉండడంతో ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు భూమి పొరలలో నీరు చేరి రంద్రాలు మూసుకుపోయాయని అన్నారు. అందులో దాక్కున్న విషపురుగులు బయట సంచారం చేస్తున్నాయని అన్నారు. దీంతో రైతులను భయాందోళనకు గురి అవుతున్నారని తెలిపారు.

ఈ క్రమంలో శనివారం గ్రామంలో వ్యవసాయ భూమిలో రైతు వెళ్తున్న క్రమంలో రెండు మీటర్ల పొడువాటి కొండచిలువ పాము కనిపించడంతో భయంతో పరుగులు తీశామని తెలిపారు. వెంటనే గ్రామంలోని పలువురికి ఫోన్ ద్వారా సమాచారం అందించి పిలిపించి దాన్ని చూపించానని తెలిపారు. అందులో కొంతమంది యువకులు దానిని చంపే ప్రయత్నం చేశారని అన్నారు. అయితే ఎంత ప్రయత్నించినా ఓర్రె నుండి బయటకు రాకపోవడంతో రైతులు మట్టి కప్పేసి వదిలేశారని వెల్లడించారు. రైతులు పొలం గట్ల పైన నడుస్తున్నప్పుడు విష పురుగులు సంచరిస్తున్నాయని, అందుకే కాళ్లకు బూట్లు ధరించి అన్ని వైపులా గమనించి వెళ్లాలని, గ్రామస్తులకు సంబంధిత రైతు ముజీబ్ కు సూచించారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad