కుంటయ్య కుటుంబానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మాజీ మంత్రి
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
అన్ని తానై నిలిచి, తనకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దని నేను అండగా ఉన్నానంటూ బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ ఎంపీటీసీ బిఆర్ఎస్ నేత కూతురు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం అంకుసా పూర్ మాజీ ఎంపిటిసి , బి అర్ ఏస్ నేత కర్కబోయిన కుంటయ్య కూతురు భార్గవి వివాహాని ఆదివారం మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఇటీవలే కుంటయ్య కాంగ్రెస్ నేతల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
ఇచ్చిన హామీ మేరకు చిన్న కూతురుకు రూ.3 లక్షలు అందజేశారు. కుంటయ్య ఆత్మహత్య చేసుకోక ముందే పెద్ద కూతురు వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో ఆదివారం పెద్ద కూతురు భార్గవి వివాహం తెలంగాణ భవన్లో ఘనంగా అని తనకి జరిపించారు. కూతురు వివాహానికి ఇచ్చిన మాట ప్రకారం ఆదుకున్న కేటీఆర్ కు కుంటయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. జీవితాంతం రుణపడి ఉంటామని వెల్లడించారు.
అన్ని తానై నిలిచిన కేటీఆర్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES