- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ మండలం మాచర్ల గ్రామానికి చెందిన రవితకు ఆదివారం ఉదయం కాన్పు నొప్పులు అధికం కావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సిబ్బంది చేరుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే రవిత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.తక్షణమే ప్రధమ చికిత్స అందించి దేగాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, శిశువు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ సాధారణ ప్రసవంలో సహకరించిన 108 సిబ్బంది ఈఎంటి శాంతా, పైలెట్ రమేష్, ఆశా వర్కర్ పుష్పలకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -