- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో బాల్కొండ మహతి ఆశ్రమంలో కృష్ణాష్టమి వేడుకలు ఆదివారం ఘనంగా జరిపినారు. రోటరీ అధ్యక్షులు జక్కుల రాధా కిషన్ మాట్లాడుతూ.. ఈ ఆశ్రమం లో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. కృష్ణుడు భాగవతంలో నూ అర్జునుడు కి ఉపదేశించినాడని. అది ఈ లోకానికి ఎంతో ఉపయోగం ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమం లో కార్యదర్శి కాంగ్రెస్ సత్యం, పాస్ట్ ప్రెసిడెంట్ పుష్పక్కర్రావు, పాస్ట్ సెక్రటరీ తులసి, పట్వారి, ట్రెజరర్ లక్ష్మీనారాయణ, పివిఆర్ శ్రీకాంత్ వన్నెల్ దేవి రాము, ఆశ్రమ మేనేజర్ నరేష్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -