పార్టీ కార్యాలయంలో ఆశ్రయం..
రూ. 5000ఆర్థిక సహాయం..
నవతెలంగాణ – గోవిందరావుపేట
వృద్ధాప్యంలో తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటూ కాపాడాల్సిన కొడుకు చిన్న వయసులోనే మృతి చెందడంతో ఆ తల్లికి సీపీఐ(ఎం) అండగా నిలిచింది. సీపీఐ(ఎం) కార్యాలయంలో పది రోజులపాటు ఆశ్రమం ఇచ్చి అక్కున చేర్చుకుంది. ఆదివారం సీపీఐ(ఎం) గోవిందరావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో పసర గ్రామానికి చెందిన సలేంద్ర శ్రీనివాస్ మృతి చెందగా అతని తల్లి అనసూయమ్మకు దశదిన కర్మ కార్యక్రమాలకు సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమానికి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ హాజరై రూ.5000 సహాయం అందించడం జరిగింది. భవిష్యత్తులో ఆ కుటుంబానికి సీపీఐ(ఎం) అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పొదిళ్ల చిట్టిబాబు, తుమ్మల వెంకటరెడ్డి, గొంధి రాజేష్, మండల కమిటీ సభ్యులు అంబాల మురళి, పంజాల శ్రీనివాస్ కడారి నాగరాజు మంచాల కవిత,శ్రీరామోజు సువర్ణ, కందుల రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
కొడుకును కోల్పోయిన తల్లికి అండగా సీపీఐ(ఎం)
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES