విద్యార్థి చదువుల కోసం దాతల చేయూత
రూ.41 వేలు అందించి దాతృత్వాన్ని చాటుకున్న దాతలు
నవతెలంగాణకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థి కుటుంబ సభ్యులు
నవతెలంగాణ – పాలకుర్తి
విద్యార్థి చదువుల కోసం దాతలు చేయూతను అందించారు. కుమారుడి చదువుల కోసం సాయం చేయండి అంటూ ఆదివారం నవతెలంగాణలో ప్రచురితమైన కథనాన్ని స్పందించిన దాతలు విద్యార్థి చదువులకు భరోసా కల్పించారు. నవతెలంగాణ కథనంతో దాతలు దాతృత్వాన్ని చాటుకున్నారు. పట్టుదలతో ఉన్నత చదువులు చదివేందుకు గిరిజన విద్యార్థి ముందుకు సాగడంతో ఆర్థికంగా ఆదుకోవాలని కృత నిశ్చయంతో దాతలు సంఘటితమయ్యారు. ఫోన్ పే ద్వారా దాతలు రూ.41 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఉన్నత చదువులకు ఢిల్లీ యూనివర్సిటీలో మండలంలోని కొండాపురం పెద్ద తండాకె గ్రామానికి చెందిన భూక్య వంశీకి అవకాశం రావడంతో ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.
సుమారు లక్షకు పైగా ఖర్చు కావడంతో ఆర్థిక స్తోమత లేక ఆవేదనకు గురయ్యాడు. దాతల సహకారంతో ఉన్నత చదువులు చదవాలని నిర్ణయించుకున్న వంశీ దాతల సహాయం కోసం ఎదురు చూశాడు. నవ తెలంగాణలో వచ్చిన కథనంతో దాతలు చేయూతనందించారు. నవతెలంగాణ కథనం దాతల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా కృషి చేయడం పట్ల నవ తెలంగాణతో పాటు దాతలను వంశీ కుటుంబ సభ్యులు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. దాతల రుణం తీర్చుకోలేనిదని, దాతలకు రుణపడి ఉంటానని, దాతలు మరింత చేయుటన అందించేందుకు ముందుకు రావాలని వంశీ కోరారు. 7674852691 నంబర్ కు ఆర్థిక సహాయం అందించగలరని కోరారు. వంశీ చదువులకు ఢిల్లీలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని జాతీయ ఎస్స కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ భరోసా ఇచ్చారు.
నవతెలంగాణ కథనానికి స్పందన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES