- Advertisement -
కొన్ని సందర్భాల లోని
బాధ దుఃఖాన్ని
శేషం చేసి వెళ్ళిపోతుంది
అనుభవించాల్సిన సమయం
దాటిపోతే వీలుపడదని
సంక్లిష్ట కాల నిర్ణయాలు ఎదురుపడతాయి
మనదాకా వస్తే కానీ
ఏదీ పూర్తి స్థాయిలో అర్థం కాదు
ఎంత సంపూర్ణం చేద్దామన్నా
కొన్ని సార్లు సశేషం అవుతుంది
సుఖాన్నైనా దుఖాన్నైనా
పవిత్రంగా ప్రేమించాలంటే
తనివితీర అనుభవించాలి..
దుఃఖాన్ని పంచుకోలేని సమయం
వడ్డీ దుఃఖాన్ని మిగిల్చి పోతుంది
నిన్ను మరింత మెలిపెట్టి పిండుతూ…
ఏదీ మిగుల్చు కోవద్దని
నువ్వు ఎంత ఆరాట పడ్డా
ఏదో ఒకటి నిన్ను వెంటాడుతూ వస్తుంది
ఆనందాలను ఎంత పోగు చేసుకున్నా
బ్రతుకు గమనం లో
దుఃఖం మిగిలే వుంటుంది
– డా.కటుకోఝ్వల రమేష్, 9949083327
- Advertisement -