నవతెలంగాణ – మిరుదొడ్డి
కుడవెళ్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట సిపి డాక్టర్ అనురాధ సూచించారు. ఎగువ ప్రాంతంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట, మిరుదొడ్డి మండలాల్లో వాగు ఉగ్రరూపం దాల్చింది. చందాపూర్ , అల్వాల శివారులో గల కూడవెల్లి వాగు రోడ్డుపై నుండి ఉధృతంగా వర్షపు నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాగు ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా వాగు దాటే ప్రయత్నం చేయవద్దని వాహనదారులకు, ప్రజలకు పోలీసులు సూచనలు చేశారు. వాగు వద్దకు వెళ్లకుండా ముళ్లకంచే, భారీ కేట్లు పోలీసులు ఏర్పాటు చేశారు. వాగులో వరద నీరు ప్రవహిస్తున్న సమయంలో చేపలు పట్టడానికి ఎవరు కూడా వెళ్ళవద్దని తెలియజేశారు. కూడవెల్లి వాగు పరిసర ప్రాంత రైతులు వ్యవసాయ పొలాల వద్దకు పశువులను తీసుకువెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. వాగు వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని సూచించారు. అనంతరం మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్లోని పలు రికార్డులను పరిశీలించారు.
గూడవల్లి వాగు ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -