మాజీ వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్
నవతెలంగాణ – గండీడ్
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన మహానీయుడు సర్దార్ సర్వాయి పాపన్న అని మాజీ వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రం అంబేద్కర్ విగ్రహం దగ్గర గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. మండలంలోని వెన్నాచేడ్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న సంఘం అధ్యక్షులు కోడూరు దస్తయ్య గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 375 వ జయంతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విపరీతమైన పన్నుల భారం సామాన్యులపై మోపుతున్న నిరంకుశ పాలన సాగించిన పాలకులపై బడుగు బలహీన వర్గాల ప్రజలను ఏకం చేసి, సైన్యంను ఏర్పాటు చేసి మొగల్ సామ్రాజ్యం పై ఎదురు తిరిగి తన ప్రాంతానికి స్వతంత్రం తెచ్చుకున్న ఘనత సర్దార్ సర్వాయి పాపన్నది అన్నారు.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జితేందర్ రెడ్డి మాట్లాడుతూ సామాన్య ప్రజలపై మొగల్ సైనికుల మొగల్ పాలకుల అరాచకాలను నిరసిస్తూ సామాన్య ప్రజలను ఏకం చేసి తిరుగుబాటు చేసి తన ప్రాంతానికి స్వాతంత్రాన్ని ప్రకటించుకున్న మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు.బడుగు బలహీన వర్గాలలో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న తన జీవితాన్ని బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పణంగా పెట్టి మొగల్ సైనికులపై తిరుగుబాటు విషయమన్నారు.ఈ సందర్భంగా గౌడ కులస్తుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు చంద్రయ్య గౌడ్,పిఎసిఎస్ డైరెక్టర్ రామ్ రెడ్డి,బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెంట్యా నాయక్,మాజీ సర్పంచులు పుల్లారెడ్డి,బోయిని గోపాల్,అనంత లక్ష్మారెడ్డి,తమ్మలి బాబు,గుర్రాల చెన్నయ్య,కామి వెంకట్రములు,అంతర్గని రాములు గౌడ్,మహిపాల్ గౌడ్,పులిందర్ రెడ్డి,గౌడసంఘం సభ్యులు,వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు,బహుజనులు తదితరులు పాల్గొన్నారు.
బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES