నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలను గౌడ సంఘం సభ్యులు ఘనంగా నిర్వహించారు. కమ్మర్ పల్లి గౌడ సంఘంలో పాపన్న గౌడ్ చిత్రపటానికి గౌడ సంఘం సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షులు మల్యాల సుభాష్ గౌడ్ మాట్లాడుతూ సింహాసనం మొక్కితే రాదు, ఎదురు వెళ్లి ఢీకొట్టి నిలబడితే వస్తుంది అని చాటి చెప్పిన అగ్గిపిడుగు సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు.
అట్టడుగు వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడానికి చివరి శ్వాస వరకు పోరాడిన ధీశాలి, బహుజనుల ఆత్మగౌరవ రక్షణకు రాజ్యాధికారమే సమాధానమని విశ్వసించి పోరాడిన యోధుడన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో గౌడ సంఘం సభ్యులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు కిషన్ గౌడ్, నవీన్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రామా గౌడ్, శ్యామ్ గౌడ్, రాము గౌడ్, దూలూరి కిషన్ గౌడ్, సాయ గౌడ్, కొడిమ్యాల శేఖర్ గౌడ్, లింగా గౌడ్, రాజ గౌడ్, భరత్ గౌడ్, వినీత్ గౌడ్, రోహిత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES