నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
పీడితులు, బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన సామాన్యుడు, గొప్ప బహుజన విప్లవకారుడు, ధీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. సోమవారం కలెకరేట్ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల శాఖ అధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి సందర్భంగా సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ , రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డితో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వాయి పాపన్న 1650 లో జన్మించారని, తండ్రి మరణించగా తల్లి ఆదేశాలతో గౌడ కులవృత్తిని ఎంచుకొని జీవనం సాగిస్తూ భూస్వామ్య వ్యవస్థ పై తిరుగుబాటు చేసి తెలంగాణ గడ్డ పై దళిత బహుజన మైనారిటీలతో కలిసి ప్రజరాజ్యాన్ని నిర్మించారని అన్నారు. కుల మతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలనే సమసమాజ ప్రజాస్వామిక స్పూర్తితో నాటి కాలంలోనే పాపన్న గౌడ్ పోరాటం గొప్ప విషయమని అన్నారు. ఆధిపత్యాన్ని ఎదిరించి బహుజన రాజ్య స్థాపన చేసిన సర్వాయి పాపన్న అందరికి అధర్శనీయుడని , బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి సర్వాయి పాపన్న గౌడ్ ను స్పూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో జడ్పీ సి ఈ ఓ శోభా రాణి, రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణా రెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి జయమ్మ, జిల్లా గ్రామీణ అధికారి నాగిరెడ్డి, బి సి వెల్ఫేర్ అధికారి సాహితీ, సంఘ నాయకులు, జిల్లా అధికారులు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
గొప్ప బహుజన విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES