నవతెలంగాణ – వెల్దండ
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పత్తి పంటలో వడతెగుళ్ళు కనిపిస్తుందని, పత్తి పంటను కాపాడుకునేందుకు వడ తెగుళ్ళు నివారణ చర్యలు చేపట్టాలని పెద్దాపూర్ గ్రామ వ్యవసాయ విస్తీర్ణ అధికారి గణేష్ రైతులకు సూచించారు. సోమవారం వెల్దండ మండల పరిధిలోని పెద్దాపూర్ గ్రామంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి గణేష్ గ్రామంలోని రైతుల పత్తి పంటలను పరిశీలించారు. పత్తి పంట వడ తెగుళ్ళు నివారణకి కాపర్ ఆక్సి క్లోరైడ్ , భావిష్టిన్ మిశ్రమంతో ట్యూబికొనజోల్ మందులను తెగుళ్ళు సోకిన మొక్క మొదల వద్ద డ్రించింగ్ చేయాలని సూచించారు. పచ్చ దోమ, తెల్ల దోమ నివారణకు మోనోక్రోటోఫాస్, ఎసిఫేట్ మందు ద్రావణాన్ని పిచికారి చేయాలని పేర్కొన్నారు. వర్షాలు తగ్గిన తర్వాత పత్తిలో పూత పింద రాలడం గమనించినట్లయితే బోరాన్ తో పిచికారి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు ఉన్నారు.
పత్తి పంటలో వడ తెగుళ్ళు నివారించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES