- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
ఆఖరి సోమవారం( శ్రావణమాసం) సందర్భంగా అక్బర్ పేట భూంపల్లి మండలం రామేశ్వరంపల్లి లోని కూడవెళ్ళి రామలింగేశ్వరాలయంలో సోమవారం శైవాగమోక్తంగా పూజలు నిర్వహించారు. ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించి తీర్థ, ప్రసాద వితరణ చేశామని ఆలయ కమిటీ చైర్మన్ ఉషయ్యగారి రాజిరెడ్డి అన్నారు. వర్షాలు కురుస్తున్నందున కూడవెల్లి వాగులో నీటి ప్రవాహం పెరిగిందని, ప్రజలు వాగులోకి దిగొద్దని విజ్ఞప్తి చేశారు. అర్చకులు సంకేత్ శర్మ పలువురున్నారు.
- Advertisement -