నవతెలంగాణ – దుబ్బాక
దుబ్బాక ప్రభుత్వ ఏరియా వంద పడకల ఆస్పత్రి ఓ .పీ (అవుట్ పేషంట్ నమోదు) విభాగంలోనూ రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ తెలిపారు. ఇదివరకే 82 శాతం నమోదుతో అబాకార్డు విభాగంలో, డయాలసిస్, ఆరోగ్యశ్రీ సేవల్లో, ఎకో ఫ్రెండ్లీ విభాగాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం వచ్చిందని, గతంలోనూ కాయకల్ప లో రాష్ట్రంలో 3 వ స్థానంలో దుబ్బాక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి నిలిచిందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేస్తూ.. ఆస్పత్రి సిబ్బందిని అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దుబ్బాక పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా.. ప్రభుత్వ ఏరియా వంద పడకల ఆస్పత్రికి వచ్చి తమ వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు.
దుబ్బాక హాస్పిటల్ ఓ.పీలో స్టేట్ నెంబర్ వన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES