కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపాల్ ఇల్లందుల సుమలత
నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్రంలోని కేజీబీ పాఠశాలలో సిఆర్టి ఇంగ్లీష్ సబ్జెక్టు బోధించేందుకు మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఇల్లందుల సుమలత తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ ఈ పాఠశాలలో ఇంగ్లీషు గెస్ట్ అధ్యాపకురాలిగా బోధించేందుకు హర్వత కలిగిన మహిళ ఉపాధ్యాయురాలు నుండి దరఖాస్తు తీసుకుంటున్నామని దీనికి ఎం ఏ ఇంగ్లీష్ బిఈడి, టెట్ చేసి ఉండాలని వీరు మాత్రమే రేపు అనగా ఈనెల 19వ తేదీ ఉదయం నుండి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు కేజీబీవీలో దరఖాస్తును తీసుకోబడినని అన్నారు.
అగ్రికల్చర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు దరఖాస్తు ఆహ్వానం
మండల కేంద్రంలోని కేజీబీ వీ పాఠశాలలో ఇంటర్మీడియట్ వారికి అగ్రికల్చర్ ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థులకు 40 సీట్లు కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఇల్లందుల సుమలత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో అగ్రికల్చర్ ఫస్టియర్ చేసుకునేందుకు 40 సీట్లు ఖాళీగా ఉన్నందున మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పదవ తరగతి పూర్తి చేసుకున్న మహిళలు ఇంటర్మీడియట్ అగ్రికల్చర్ లో చేరేందుకు మంచి అవకాశం ఉందని ఈ అవకాశాన్ని సాద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ తెలిపారు.