Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పాపన్న ఆశలను కొనసాగిద్దాం 

పాపన్న ఆశలను కొనసాగిద్దాం 

- Advertisement -

నవతెలంగాణ – నెల్లికుదురు
బహుజన రాజ్యాధికారం కోసం పోరాడి పేదలకు న్యాయం చేసిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను ప్రతి ఒక్కరం కొనసాగించాలని కల్లుగీత కార్మిక సంఘ నాయకులు అన్నారు. మండల అధ్యక్షుడు రాగిపెల్లి ప్రధాన కార్యదర్శి శీలం సత్యనారాయణ, వెంకన్న, ఎస్సై చిర్ర రమేష్ బాబు, విగ్రహ గద్దె ఫౌండర్ బత్తిని అనిల్ గౌడ్, గోపా సంఘం మండల కమిటీ అధ్యక్షుడు గడ్డం యాలాద్రి, మాజీ ఎంపీపీ గోగుల మల్లయ్య, జిల్లా నాయకుడు వీరగాని మల్లేశం, గౌడ్ మాజీ ఎంపీటీసీ పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్ మాజీ జెడ్పిటిసి హచ్ వెంకటేశ్వర్లు మాజీ ఎంపీటీసీ వెన్నకుల వాణి శ్రీనివాస్ తెలిపారు.

మండల కేంద్రంలోని సర్దార్ సర్వాయి పాపన్న 375 వ జయంతి ఉత్సవాలను గౌడ సంఘం మండల అధ్యక్షుడు సుధాకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అగ్రకులాల నాయకులు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను అణిచివేస్తున్న క్రమంలో బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న వారిని ఎదిరించి పోరాడేందుకు బీసీ కులాలను ఏకం చేసి ఎదిరించి పేదల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి సర్వాయి పాపన్న  అన్నారు. ఆయన గోల్కొండ కోట నిర్మించుకొని ఆ కోటలో జెండా ఎగరవేసి పేదల పక్షాన నిల్చున్న వ్యక్త అన్నారు. ఈ కార్యక్రమంలో పెరుమాళ్ళ చంద్రమౌళి గౌడ్ సత్యనారాయణ గౌడ్ కృష్ణయ్య గౌడ్ ఉపేందర్ గౌడ్ ఆదిరెడ్డి వెంకన్న గౌడ్ జగ్గయ్య కక్కెర్ల లక్ష్మయ్య గౌడ బహుజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad