Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లనే యూరియా కొరత 

కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లనే యూరియా కొరత 

- Advertisement -

బీజేపీ మండల అధ్యక్షుడు చందు రాజ్ కుమార్ యాదవ్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 

రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ముందస్తుగా రైతులకు కావాల్సిన యూరియాను ఎంత సరిపడుతుందని గుర్తించకపోవడం వలన ఈరోజు యూరియా కొరత ఏర్పడుతుందని, ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి రైతాంగాన్ని ఆదుకోవాలని బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు చందు రాజ్ కుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ముందస్తుగా రాబోయే వర్షాకాలానికి తెలంగాణ రైతాంగం ఏ ఏ పంట ఎంత సాగు అవుతుందని, రైతులు సాగు చేస్తున్న విస్తీర్ణాన్ని ముందస్తుగా గుర్తించకపోవడం వలన ఈరోజు యూరియా కొరత ఏర్పడిందని అన్నారు. దానిని కాంగ్రెస్ పార్టీకి బదనం కాకుండా బిజెపిని బదనం చేయడానికి కోసమే రేవంత్ సర్కార్ అనేక మాటలు మాట్లాడుతుందని అన్నారు.

 గత 10 సంవత్సరాలలో లేని యూరియా కొరత ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే రేవంత్ సర్కార్ నిర్లక్ష్య ధోరణి వలన యూరియా కొరత అని తెలిపారు  పరిపాలన చేతకాక  రేవంత్ రెడ్డి సర్కార్ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తుందని. ఇప్పటికైనా దృష్టి పెట్టి ఆరు  గ్యారంటీలను  అమలు చేయాలని కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad