తెలంగాణ కు రావాల్సిన వాటాను కేంద్రం వెంటనే ఇవ్వాలి
యూరియా ఇయ్యకుంటే ఉద్యమం చేస్తాం
కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసం లక్ష్మారెడ్డి
నవతెలంగాణ – నెల్లికుదురు
తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటాను కేంద్ర ప్రభుత్వం బిజెపి తక్షణమే ఇవ్వాలని లేదంటే రైతు ఆగ్రహానికి కేంద్ర ప్రభుత్వం గురి కాక తప్పదని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసo లక్ష్మారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు గుగులోతు బాలాజీ నాయక్ కిసాన్ సెల్ రాష్ట్ర నాయకుడు పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఓట్లు చోరీ చేసిన బిజెపి . ఇప్పుడు యూరియాను కూడ చోరీ చేయడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చెందారు.
తెలంగాణ రాష్ట్రనికి యూరియా ఇవ్వనందుకు నేడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ధర్నా చేసే సందర్భం నెలకొన్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ గ్రామ ఇస్తే ఈ సమస్య ఉండేది కాదని తేల్చి చెప్పారు.రాష్ట్రంలో 8మంది బిజెపి పార్టీ ఎంపీలు ఉన్నప్పటికీ ఒక్కరు కూడా సమస్యపై మాట్లాడకపోవడం విచారకరమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని బిజెపి పట్టించుకున్న పాపాన పోవట్లేదు అని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు తెలిపారు. బిజెపి ఎంపీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారా లేరా అన్న విధంగా చోద్యం చూడాల్సిన సందర్భంగా నెలకొన్నదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతుల గోస తాకి బీజేపీ పతనమవ్వక తప్పదని అన్నారు.
అన్నం పెట్టే రైతుకు బిజెపి మోదీ ప్రభుత్వం కడుపుకోత మిగిలుస్తుంది. అది సరే ఏంది కాదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తెలంగాణ రాష్ట్రం రావాల్సిన వాటాను ఇస్తూ యూరియాను తక్షణమే సరఫరా చేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. లేనిచో కేంద్రంపై తిరగ పడక తప్పదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రజాపాలనలో వ్యవసాయ రంగానికి, రైతు సంక్షేమానికి కట్టుబడి,రాష్ట్ర బడ్జెట్లో ఇప్పటివరకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ దాదాపు లక్ష కోట్ల రూపాయలు అత్యధికంగా ఖర్చు చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ గుగులోత్ భాస్కర్ నాయక్, మంగీలాల్,రావుల సతీష్, మండల నాయకులు, కొప్పు శ్రీను,లింగ్య నాయక్, గుగులోత్ సునీత, ఇచ్చని,రాజు యాదవ్, రమేష్ నాయక్,సురేష్, శ్రీరంగం శ్రీను,శివాజీ నాయక్, కంసల్య, వినోదా, తదితరులు పాల్గొన్నారు.