నవతెలంగాణ – నెల్లికుదురు
పెన్షన్ విద్రోహ దినం సెప్టెంబర్ 1న పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద జరిగే మహా ధర్నాలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని పి ఆర్ టి యు టి ఎస్ మహబూబాద్ జిల్లా అధ్యక్షుడు మిరియాల సతీష్ రెడ్డి కోరారు. సోమవారం మండల కేంద్రంలోని పి ఆర్ టి ఓ టి ఎస్ నెల్లికుదురు మండల కమిటీ అధ్యక్షుడు కొత్త నరసింహారెడ్డి ప్రధాన కార్యదర్శి గొట్టిముక్కుల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సంబంధిత పోస్టర్ను ఆవిష్కరించే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంట్రీబ్యూటర్ పెన్షన్ అనేది ఆరోగ్యంగా ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిందని ఈ సిపిఎస్ విధానాన్ని అంతం మెo దించేందుకే హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద ఈ ధర్నా జరుగుతుందని అన్నారు దీనికి అందరూ విధిగా హాజరై దిగ్విజయం చేయాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు యుగేందర్ రెడ్డి రాష్ట్ర బాధ్యులు సాయిలు లక్ష్మణ్ జిల్లా బాధ్యులు జే శ్రీనివాస్ సాయి ప్రసాద్ గౌట్ గౌట్ హైస్కూల్ జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్ మిట్టకోల రవి జీవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎస్ ను తక్షణమే రద్దు చేయాలి: మిరియాల సతీష్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES