Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గోకారంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహా ఆవిష్కరణ 

గోకారంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహా ఆవిష్కరణ 

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ 
మండలంలోని గోకారం గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మైళ్ళ శ్రీనివాసుల చేతుల మీదుగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మైళ్ళ శ్రీనివాసులు మాట్లాడుతూ సర్వాయి పాపన్న 17వ శతాబ్దంలో మొఘల్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు కొందరు సర్వాయి పాపన్న గౌడ్ అని కూడా అంటారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అంచలంచెలుగా ఎదిగి ఒక వీరుడిగా మారారు. పాపన్న గౌడ్ పోరాటాలు అణగారిన వర్గాల ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని నింపాయి .ఆయన ధైర్యసాహసాలు, ప్రజా పోరాటాలు తెలంగాణ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందాయి.

ఇప్పటికి ఆయనను ఒక వీరుడిగా పోరాట నాయకుడిగా స్మరించుకుంటారన్నారు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఇతని విగ్రహాలు స్మారక చిహ్నాలు కనిపిస్తాయను తెలిపారు. గోకారం గ్రామం స్ఫూర్తిగా తీసుకొని, జిల్లాలో, మండలంలో, గ్రామాలలో, రానున్న రోజుల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గౌడ సంఘం నాయకులకు సూచించారు.కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటయ్య గౌడ్, గౌడ సంఘం నాయకులు, మండల అధ్యక్షులు, గ్రామస్తులు,యువత పెద్ద ఎత్తున పాల్గొని, సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలతో సమానమైన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఈ వేడుక గౌడ సమాజ ఐక్యతకు, అభ్యున్నతికి కొత్త ఊపును అందించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad