నవతెలంగాణ – చారకొండ
మండలంలోని కె ఆర్ కె ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన సభకు ముఖ్య అతిథులుగా నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ దే అధికారమని , నాయకులు కార్యకర్తలు ఎవరు అధైర్య పడద్దని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ నుండి ఎంతమంది పోయిన, పార్టీ బలహీన పడదని రాబోయే శాసనసభ ఎన్నికలలో అచ్చంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుస్తారనీ పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గం అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చిన ముందుంటానని హామీ ఇచ్చారు.
కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ వచ్చే స్థానిక ఎన్నికలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పని చేసి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ పార్టీ మారడంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కరరావు, కల్వకుర్తి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్మ సత్యం,శిరసనగండ్ల మాజీ సర్పంచ్ యాతం శ్రీను, మండల యూత్ ప్రెసిడెంట్ చండీశ్వర్ గౌడ్, శ్రీను మాజీ వైస్ ఎంపీపీ వెంకటయ్య గౌడ్, కమలాకర్ రావు, సలీం, మాజీ సింగల్ విండో చైర్మన్ గజ్జె యాదయ్య, రామకృష్ణ, ప్రశాంత్, మహేష్ గౌడ్, బొడ్డుపల్లి శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.
రాబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ దే అధికారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES