- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
మండలంలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నందున తిమ్మాయిపల్లి రెవెన్యూ పరిధిలోని గ్రామపంచాయతీ సారంబండ తండా నుండి దొంతులగుట్ట తండా దిగువ వంతెన మధ్య రంధ్రం ఏర్పడింది. అలాగే రాజీవ్ గాంధీ నగర్ తండా నుండి దొంతల గుట్ట తండకు వెళ్లే రోడ్డులోని కల్వర్టు కూలిపోయింది. అక్కడి పరిస్థితులను ఎమ్మార్వో సునీత సందర్శించి రవాణాను ఆపడానికి రెండు వైపులా తాత్కాలిక కంచెలు వేశామని వారు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై శంషుద్దీన్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆర్ అండ్ బి, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.
- Advertisement -