నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలం మహబూబ్ పేట సోమవారం, సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా పాపన్న విగ్రహానికి గౌడ సంఘం అధ్యక్షులు గాజుల రఘుపతి, మాజీ అధ్యక్షులు గాజుల శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం నాయకులు పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిoచారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అణగారిన వర్గాలకు దిక్సూచిగా నిలిచిన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న అని నిమ్న వర్గాల్లో కాంతిని నింపడమే గాక తమ జాతి కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప ప్రజ్ఞా శాలి అని ఆయన పేద బడుగు బలహీనవర్గాలకు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఆరె నారాయణ , మచ్చ కిష్టయ్య , యాదండ్ల సిద్దిరాజ, గాజుల బాలయ్య, కసావు చంద్రయ్య, గాజుల సత్తయ్య, గాజుల అంజయ్య, సుదగాని వెంకటయ్య, ఆరె రమేష్, యదండ్ల యాదయ్య, ఆరె జంగయ్య, మచ్చ కిషన్, గాజుల వీరస్వామి, గాజుల రవి కుమార్, గాజుల పాండు, ఆరె బిక్షపతి, ఆరె రాజేష్ , బీస సతీశ్, మచ్చ సాయిరాం, వేముల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES