నవతెలంగాణ – ధర్మసాగర్
పాత పెన్షన్ విధానం ముద్దు కొత్త పెన్షన్ విధానం వద్దు అని పిఆర్టియు మండల అధ్యక్షులు అని రెడ్డి ప్రభాకర్ రెడ్డి మండల కేంద్రంలో సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహదినం మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ సి పి ఎస్ అంతం-పీఆర్టీయూ పంతంపీఆర్టీయూ టీఎస్ ధర్మసాగర్ మండలశాఖ ఆధ్వర్యంలో మహా ధర్నా పోస్టర్ ఆవిష్కరణ మండల కేంద్రంలోని హైస్కూల్ బాలుర పాఠశాలలో జరిగింది. ఈ సందర్భంగా అనిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పాత పెన్షన్ స్కీం స్థానంలో సెప్టెంబర్1,2004 నుండి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ను కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. అప్పటి నుండి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు సీపీఎస్ రద్దు కోరుతూ అనేక విధాలుగా నిరసనలు చేపట్టాయని తెలిపారు.
ఈ విషయంపై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో అనివార్య పరిస్థితుల్లో ఉద్యోగులు ఉపాధ్యాయులు పోరుబాట పట్టాల్సి వచ్చిందన్నారు. అందులో భాగంగా సీపీఎస్ అంతం-పీఆర్టీయూ పంతం అనే నినాదంతో సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహదినం సందర్భంగా పీఆర్టీయూ టీఎస్ మహా ధర్నా కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్నమని,ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు ముఖ్యంగా సీపీఎస్ ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై మహా ధర్నా ను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా,మండల నాయకులు ,ఉపాధ్యాయులు పాల్గొని పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
పాత పెన్షన్ విధానం ముద్దు.. కొత్త పెన్షన్ విధానం వద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES