మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి
సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ..
నవతెలంగాణ – కట్టంగూర్
గ్రామపంచాయతీ ఉద్యోగ,కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని ఈదులూరు గ్రామంలోతెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) 7వ మండల మహాసభ నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామపంచాయతీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేస్తామని, మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేస్తామని, అర్హత కలిగిన కార్మికులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చిందని,అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క హామీ ని అమలు చేయలేదని ఆరోపించాడు.
వేతనాలు కూడా సకాలంలో రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో కార్మికులు సమ్మెలు చేసినప్పుడు తమ మద్దతు ఇచ్చి మేము అధికారంలోకి వస్తే సమస్యలన్నీ తీరుస్తామని చెప్పిన వారు నేడు పట్టించుకోవడంలేదని విమర్శించారు. జిల్లాలో గ్రామపంచాయతీ కార్మికులకు సెలవు ఇవ్వకుండా అధిక పనిగంటలతో స్పెషల్ ఆఫీసర్లు వేధిస్తున్నారని ఆరోపించారు.సెలవుల పేరుతో వేతనాలు అడ్డగోలుగా కోత విధిస్తున్నారని, బట్టలు,సబ్బులు,చెప్పులు,నూనెలు,ఇన్సూరెన్స్ ఇవ్వాలని ఆదేశాలు ఉన్న నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.సెప్టెంబర్ లో జరిగే యూనియన్ రాష్ట్ర జిల్లా మహాసభల్లో కార్మిక సమస్యలు చర్చించి భవిష్యత్తు కర్తవ్యాలు రూపొందిస్తామని చెప్పారు. కొమ్ము వినోద్, ఏ యాదమ్మ అధ్యక్షతన జరిగిన మహాసభలో సిఐటియు జిల్లా నాయకులు పెంజర్ల సైదులు, మత్స్య కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మురారి మోహన్, ఆశా యూనియన్ జిల్లా కార్యదర్శి తవిటి వెంకటమ్మ, యూనియన్ జిల్లా నాయకులు పొన్న అంజయ్య, గుడుగుంట్ల వెంకటయ్య, రామలింగయ్య ఉన్నారు.
పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES