Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్తిమ్మాపురంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి

తిమ్మాపురంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  
భువనగిరి మండలంలోని బి ఎన్ తిమ్మాపురం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  375వ జయంతి ఉత్సవాలను గ్రామపంచాయతీ సెక్రెటరీ కృష్ణ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  గ్రామ గౌడ అధ్యక్షులు దంతురి వెంకటేష్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజన సమాజం కోసం పాటుపడ్డారని ఆయన ఆశయ సాధనాల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. మా గ్రామం బస్వపురం రిజర్వాయర్లో ముంపునకు గురవుతున్నందున  గౌడ కులస్థులందరం మా వ్యవసాయ భూములు కోల్పోవడమే కాకుండా మా కులవృత్తి అయినటువంటి తాటిచెట్లు మరియు ఈతచెట్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారని,  మరో చోట తాటిచెట్లు అధికంగా ఉన్న ప్రాంతంలో మా గౌడ కులస్థులందరికి తాటి చెట్లు ఎక్కేవిదంగా మాకు వృత్తి దారి చూపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.   

కార్యక్రమంలో గౌడ సంగం ఉపాధ్యక్షుడు మెడబోయిన శివనంద్, ప్రధానకార్యదర్శి నకిరేకంటి నర్సింహ గౌడ్, డైరెక్టర్లు దంతురి ఈశ్వరయ్య, ఎరుకలి సత్యనారాయణ గౌడ్, దొంకేన సత్తయ్య గౌడ్,అన్నెపు కిష్టయ్య,దొంకేన నర్సింహ గౌడ్, గ్రామ పెద్ద గౌడ్ దొంకేని ప్రభాకర్ గౌడ్, నకిరేకంటి పెద్ద బాలయ్య ,దొంకేని పాండు నకిరేకంటి శ్రీను,దొంకేన అశోక్,ఎరుకలి రాజు,రావుల నందు,దంతురి నర్సింహ,మెరుగు ఈశ్వరయ్య,హరినాద్, నకిరేకంటి హరిబాబు గౌడ్ దొంకేని విమలకర్ ,ఎరుకలి శ్రీరాం గౌడ్ ,దంతురి కృష్ణ గౌడ్ అన్నెపు శ్రీశైలం దొంకేని నర్సింహ,అన్నెపు నందు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad