Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుకైనెటిక్ గ్రీన్ ఎలక్ట్రిక్ ఈవి టూ వీలర్స్ షోరూమ్ ప్రారంభం 

కైనెటిక్ గ్రీన్ ఎలక్ట్రిక్ ఈవి టూ వీలర్స్ షోరూమ్ ప్రారంభం 

- Advertisement -

నుడా చైర్మన్ కేశవేణు, NDCCB మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 

నిజామాబాద్ బోర్గాం కమాన్ పక్కన గల కోదండ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కైనెటిక్ గ్రీన్ ఎలక్ట్రిక్ EV టూ వీలర్స్ షోరూంను నుడా చైర్మన్ కేశవ వేణు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇద్దరూ సాఫ్ట్వేర్ మిత్రులు జాబులను వదిలి గో గ్రీన్ అనే కాన్సెప్ట్ కింద కైనెటిక్ ఎలక్ట్రిక్ టీవీ ల్స్ టూ వీలర్స్ షోరూమ్ ను ప్రారంభించడం అభినందించదగ్గ విషయం అన్నారు. బాన్సువాడ రూరల్ ఇబ్రహీంపట్నం కు చెందిన మాజీ సర్పంచి మాలెపు నారాయణరెడ్డి కుమారుడు రాజశేఖర్ రెడ్డి నిజాంబాద్ కు చెందిన విలేకరి రాజా చందర్ గుండు కుమారుడు రాజ్ కిరణ్ లకు శుభాకాంక్షలు తెలిపారు.

చాలా మంచి కాన్సెప్ట్ ఎన్నుకున్నారని కొనియాడారు. ప్రస్తుత యుగమంతా ఎలక్ట్రిక్ వాహనాలదే అందులో కైనెటిక్ బ్రాండెడ్ కంపెనీ కాబట్టి మంచి ఫ్యూచర్ ఉంటుందని తెలిపారు. NDCCB మాజీ చైర్మన్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ బాన్సువాడ రూరల్ ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన నా మిత్రుడు మాజీ సర్పంచ్ మాలెపు నారాయణరెడ్డి కుమారుడు రాజశేఖర్ రెడ్డి నూతన కైనెటిక్ ఎలక్ట్రిక్ షోరూమ్ ను ప్రారంభించడం గర్వించదగ్గ విషయం అన్నారు. మీ షో రూమ్ అందరూ ఆదరించాలని సాఫ్ట్వేర్ జాబ్ చేసేవారు జాబులు వదిలి వ్యాపార రంగం లోకి అడుగు పెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు బంధుమిత్రులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad