Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సర్దార్ సర్వాయి పాపన్న ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి..

సర్దార్ సర్వాయి పాపన్న ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి..

- Advertisement -

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
సర్దార్ సర్వాయి పాపన్న ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని సూర్యాపేట జిల్లా సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం అధ్యక్షుడు పులుసు వెంకన్న, సాంస్కృత విభాగం రాష్ట్ర అధ్యక్షులు గిలకత్తుల రమేష్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలంపల్లి వినయ్ గౌడ్ లు అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండు సమీపం లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న 375 వ జయంతి ఘనంగా నిర్వహించినందుకు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు వెంకన్న గౌడ్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు బహుజనుల కోసం 1700 శతాబ్దంలోనే హక్కుల కోసం పోరాడి బహుజన రాజ్యాన్ని తీసుకురావడానికి పోరాటం చేసిన బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు.

పీడిత జనుల కోసం, బహుజనుల ఆత్మగౌరవం కోసం తన సర్వసాన్ని ధారబోసిన మహ యోధుడు అని చెప్పారు. నిరంకుశ పాలనకు ఎదురోడి, అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన పాపన్న గౌడ్ తెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా మహిళా అధ్యక్షురాలు గిల కత్తుల నాగమణి గౌడ్, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి అనంతుల నవ్య గౌడ్, సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షులు అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి నకిరేకంటి చిరంజీవి, ఉద్యమ కళాకారుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కోట వీరస్వామి, పాముల కృష్ణ, లింగన్న, సువర్ణ, వెంకటమ్మ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad