Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పేస్ క్యాప్చర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కలెక్టరేట్ ముట్టడి..

పేస్ క్యాప్చర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కలెక్టరేట్ ముట్టడి..

- Advertisement -

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్అంగడి వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ కి కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతంగా జరిగింది అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగడి వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ కి పనిభారం తగ్గించాలనీ అన్నారు. ఫ్రీ స్కూల్ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని అన్నారు. విద్యా బోధన బాధ్యతను అంగన్వాడీ టీచర్స్ కు ఇవ్వాలని తెలిపారు. విద్యా వాలంటీర్లకు నిర్ణయించిన వేతనాన్ని వీరికి అదనంగా చెల్లించాలనీ, ఐసిడిఎస్ కు సంబంధం లేని బిఎల్ఓ డ్యూటీలు రద్దు చేయాలని, అదనపు పనులు రద్దు చేయాలి డిమాండ్ చేశారు.

ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ఐసిడిఎస్ 19 75 అక్టోబర్ 2న ప్రారంభమైనేటికి 50 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఈ సంస్థ పేద ప్రజలకు సేవలు అందించే విషయంలో జాతీయ అంతర్జాతీయ మన్ననలు పొందిన ఐసిడిఎస్ సంస్థ 2005లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఐసిడిఎస్ ను దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు విస్తరింప చేయాలని తీర్పునిచ్చిందనీ ఆయన అన్నారు. శ్రామిక జిల్లా కన్వీనర్ చెరుకు ఏకలక్ష్మి మాట్లాడుతూ.. ఐసిడిఎస్ ను సంస్థాగతం చేయాలని టీచర్స్ హెల్పర్స్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని 2024 లో గుజరాత్ హైకోర్టు తీర్పునిచ్చిందనీ 1995లో అంగన్వాడి కేంద్రాలలో పౌష్టిక ఆహారంతో పాటు విద్యను అందించే ఈసీసీ కేంద్రాలుగా ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ గా మార్చాలని అంగన్వాడీ ఉద్యోగులు అడుగుతున్నారు.

ఈ విద్యను అందించడానికి ఆటంకంగా ఉన్న బిఎల్ఓ తదితర ఐసిడిఎస్ కు సంబంధం లేని అదనపు పనులను రద్దు చేయాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేసారు.అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ జిల్లా అధ్యక్షురాలు బొలిశెట్టి భాష్కరమ్మ మాట్లాడారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటి సభ్యులు రణపంగి కృష్ణ, వలపుదాసు సాయికుమార్, ప్రజా నాట్యమండలి జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న,అంగన్వాడీ టీచర్స్ తుంగతుర్తి ప్రాజెక్టు అధ్యక్షులు ధనలక్ష్మి, ప్రధాన లింగమ్మ, స్వరూప, స్వప్న, మాధవి, నాగలక్ష్మి, పద్మ, ఎం విజయలక్ష్మి, పార్వతి అనురాధ సుజాత హేమలత, ప్రభావతి ,ప్రమీల లతో పాటు నవీన్, గోపాల్ దాస్ శ్రీరాములు, జిల్లాలో నుండి అన్నీ మండలాల నుండి అనేకమంది టీచర్స్ అండ్ హెల్పర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad