– గీత కార్మిక సంఘం ఆద్వర్యంలో వృద్దులకు పండ్లు పంపిణీ
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మున్సిపాల్టీ, గౌడ్, గీత కార్మిక సంఘాలు ఆద్వర్యంలో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ నాగరాజు మాట్లాడుతూ.. నాటి సామాజిక రాజకీయ పరిస్థితుల్లో బడుగు,బలహీన వర్గాల పక్షాన నిలబడి పోరాడిన యోధుడు సర్వాయి పాపన్న అని ఆయన ధీరత్వాన్ని కొనియాడారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నేటి తరానికి ఆదర్శ పురుషుడు అని అశ్వారావుపేట గౌడ సంఘం గీత కార్మిక సంఘం నాయకులు అన్నారు. కూడలిలో ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి అశ్వారావుపేట గౌడ్ సంఘం అధ్యక్షుడు ఆరేపల్లి సాంబశివరావు గౌడ్ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమంలో గౌడ్ సంఘం అధ్యక్షుడు ఆరేపల్లి సాంబశివరావు గౌడ్, గీత కార్మిక సంఘం అధ్యక్షులు ఆరేపల్లి వెంకటేష్ గౌడ్ (గోవిందా),మైనం రామకృష్ణ, తాళం సూరిబాబు,నాయుడు శ్రీను,మోర్ల దుర్గారావు, ఆరేపల్లి ముసలయ్య, ఎమ్.వెంకన్న, ఏ.గోవిందరాజు, వి.భగవన్నారాయణ, బి.నాగరాజు, ఏ.జగదీష్, వి.శ్రీనివాస్, వి.సుబ్రహ్మణ్యం. బి.ఆంజనేయులు, పి.దుర్గారావు, శివ, వెంకట సత్యనారాయణ( గణపతి) తదితరులు పాల్గొన్నారు.