నవతెలంగాణ – మిరుదొడ్డి
మిడిదొడ్డి మండల స్థాయి ప్రాథమిక పాఠశాలల బోధనాభ్యాసన సామాగ్రి మేళాను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల నుండి తయారుచేసిన బోధన సామాగ్రిని ప్రదర్శించరు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ప్రవీణ్ బాబు పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధనా సామాగ్రితో బోధించడం వల్ల బోధన సులభతరం అవుతుందని విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే పద్ధతుల్లో బోధించవచ్చని,ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా బోధన సామాగ్రిని వినియోగించి బోధనను సమర్థవంతంగా బోధించాలని సూచించారు.
జిల్లా స్థాయికి ఎంపికైన పాఠశాలల ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అక్బర్ పేట భూంపల్లి మండల విద్యాధికారి అంజా గౌడ్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకట రామలింగం, కాసులాబాద్ ప్రధానోపాధ్యాయులు రామచంద్రారెడ్డి,హెల్త్ ఆఫీసర్ సమీరా, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అర్చన ప్రియదర్శిని, అల్వాల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మజ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా మండల స్థాయి బోధనభ్యాసన సామాగ్రి మేళా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES