నవతెలంగాణ – మిరుదొడ్డి
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు బాధ్యతగా విధులు నిర్వహించి, ప్రజలతో మమేకంగా ఉంటూ దర్యాప్తులను తీసుకోవలసిన బాధ్యత సంబంధిత పోలీసులపై ఉందని సిపి డాక్టర్ అనురాధ అన్నారు. సోమవారం మిరుదొడ్డి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కేసుల వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇసుక, జూదం, పిడిఎస్ రైస్ , అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేకంగా పెట్టాలని సూచించారు. ప్రజలు పోలీస్ స్టేషన్ వచ్చి దరఖాస్తు చేస్తే వారికి మర్యాదపూర్వకంగా దరఖాస్తును తీసుకొని వారి సమస్య పరిష్కారం చేయవలసిన బాధ్యత మనపై ఉందని తెలిపారు.
పోలీస్ అధికారులు సిబ్బందికి క్రమశిక్షణతో పాటు ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉండి నీతి నిజాయితీతో విధులు నిర్వహించాలని తెలిపారు. విలేజ్ పోలీస్ ఆఫీసులో విలేజ్ యొక్క సమాచారం అందుబాటులో ఉంచుకొని ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పోలీసులు వారి విధి నిర్వహణతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. సమయము దొరికినప్పుడల్లా వాకింగ్, రన్నింగ్, యోగా వంటివి పోలీసులు చేయాలని అన్నారు. పాత నేరస్తుడి కేడీలు, డీడీలు సస్పెన్షన్లను తరచుగా తనిఖీ చేస్తూ వారికి నియమ నిబంధనలు తెలపాలని అన్నారు. పాత కేసులపై నిగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఏసీబీ రవీందర్ రెడ్డి, దుబ్బాక సిఐ శ్రీనివాస్, ఎస్ఐ సమంత, ఎస్బిఐ కిరణ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతగా విధులు నిర్వహించాలి: సిద్దిపేట సీపీ డా. అనురాధ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES