నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీలో న్యాయ కళాశాలలో సోమవారం మూట్ కోర్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి నిజామాబాద్ న్యాయవాది రామగౌడ్ న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలోఒక నేరస్తుడైన వ్యక్తి తన రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి చేసిన సైబర్ నేరంపై విద్యార్థులకు అవగాహన కల్పించినారు. అనంతరం జరిగిన వాద ప్రతివాదనలలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం కొరకు సగం మంది విద్యార్థులు, నిందితుల తరపున సగం మంది విద్యార్థులు హాజరై వాద ప్రతివాదనతో కార్యక్రమం ఆద్యంతం ఆసక్తిగా నిర్వహించినారు.
దీని ఆధారంగా క్రిమినల్ కేసులలో క్రిమినల్ కోర్టులు ఎలా పనిచేస్తాయో విద్యార్థులు సమగ్రంగా అర్థం చేసుకున్నారు. న్యాయమూర్తి రామగౌడ్ విద్యార్థులకు క్రిమినల్ విషయాలలో నిందితుల హక్కులను, చట్టంలో వారికి సంబంధించిన నిబంధనలు ఏ విధంగా పరిష్కరిస్తారో వివరంగా తెలిపారు. ఈ మూట్ కోర్టు ద్వారా నేర విషయాలలో నిందితుల నిజమైన కోర్టు విధులు, హక్కులను అర్థం చేసుకోగలమని విద్యార్థులు భావించారు.ఈ మూట్ కోర్టు నిర్వహణ కార్యక్రమంలో డాక్టర్ కె. ప్రసన్న రాణి, ప్రిన్సిపాల్, హెడ్,డాక్టర్ బి. స్రవంతి, బిఓఎస్, డాక్టర్ ఎం. నాగజ్యోతి, లా ఫ్యాకల్టీ సభ్యులు,విద్యార్థులు పాల్గొన్నారు.