ఘన నివాళులు అర్పించిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు
నవతెలంగాణ – కంఠేశ్వర్
వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ వద్ద గల విగ్రహాల పార్కులో గల సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజన ధీరత్వానికి ప్రతీక అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తితో బహుజనులు అందరి ముందుకు సాగి తమ హక్కులను సాధించుకోవాలని అన్నారు . బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కావాలంటే బీసీ కులాలు అన్ని ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్, ధర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, చంద్రమోహన్, గూపన్ పల్లి శంకర్, గంగాకిషన్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES