Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సర్దార్ సర్వాయి పాపన్న జయంతి రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించాలి.! 

సర్దార్ సర్వాయి పాపన్న జయంతి రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించాలి.! 

- Advertisement -

తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర సలహాదారులు పెద్ది వెంకట్రాములు 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

సర్దార్ సర్వాయి పాపన్న జయంతి రోజున ప్రభుత్వం సెలవును ప్రకటించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర సలహాదారులు పెద్ది వెంకట రాములు డిమాండ్ చేశాడు. ఈ మేరకు సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న 375 వ జన్మదినం పురస్కరించుకొని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ నిజామాబాద్ ఆధ్వర్యంలో అమరుల బాగ్ లో గల సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వం అంబేద్కర్ భవన్లో ఏర్పాటుచేసిన జయంతి సభలో పెద్ది వెంకట్రాములు ప్రసంగించారు.  పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ… తెలంగాణ తొలి బహుజన విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు.

ఆనాటి చివరి మొగలు సామ్రాట్ ఔరంగాజేబు పాలనలో తెలంగాణలో గల రెడ్డి, కరణం, వెలమ, ముస్లిం దొరల జమీందారీ పోకడలకు వ్యతిరేకంగా, వారు వ్యవహరిస్తున్న నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా, సామాన్య గౌండ్ల కుటుంబంలో పుట్టి తన మిత్రఘణంతో ప్రాథమిక కమిటీ 12 మందితో వేసుకొని, 12,000 మంది సైన్యాన్ని తయారు చేసుకొని నిరంకుశ ఏడు సంస్థానాలను ఓడించి ఆక్రమించి గోల్కొండ ఖిల్లాని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ఘనుడు సర్వాయి పాపన్న. కానీ ఈరోజు ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో ఘనంగా అధికారికంగా జన్మదిన వేడుకలు జరుపుతున్నారు. ఈ ఘనత తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం సాధించింది అన్నారు. ఎందరికో జన్మదిన – వర్ధంతుల సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటిస్తున్నది. చత్రపతి శివాజీ సమకాలీకుడైన తొలి తెలంగాణ పోరాట యోధుడు సర్వాయి పాపన్న జన్మదిన రోజున సెలవు దినంగా ఎందుకు ప్రకటించరు అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఖచ్చితంగా ఆగస్టు 18న సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం.

ఈరోజు పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మరియు తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పైన సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణకు భూమి పూజ చేస్తున్నారని వినపడుతుంది. దాన్ని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నది. ఇదే సరిపోదు., ప్రభుత్వం గౌడ గీత కార్మికుల పైన, బహుజనుల పైన, వృత్తిదారుల పైన జరుగుతున్న గ్రామ అభివృద్ది కమిటీల దాడులను నిలువరించకపోతే సర్వాయి పాపన్నకు సరైన నివాళు ఇచ్చినట్టు కాదు అని గుర్తు చేశారు. ఈ మధ్యకాలంలో మోర్తాడ్ మండల కేంద్రంలో సర్వాయి పాపన్న విగ్రహాన్ని అక్కడి కాపు కులస్తులు కూల్చివేశారు. గీత కార్మిక సంఘాలు, వామ పక్ష ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు నెల రోజులపాటు దీక్షలు నిర్వహిస్తే కూతవేటు దూరంలో ఉన్న బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి అయిన వేముల ప్రశాంత్ రెడ్డి గారు దీన్ని గమనించకపోవడం శోచనీయం. పోరాటం అనంతరం ప్రశాంత్ రెడ్డి గారు వచ్చి చర్చలు జరిపి ఆ విగ్రహాన్ని అక్కడ కూర్చోబెట్టారు.

ఇది సర్వాయి పాపన్న స్ఫూర్తి విజయం అని పెద్ది వెంకట్రాములు కొనియాడారు. అప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారని కలుగత కార్మిక సంఘం అడుగుతుంది. అంతేకాదు గ్రామాభివృద్ధి కమిటీల వాళ్ళు గీత వృత్తిని ఆధారం చేసుకుని జీవనం గడుపుతున్న పేదల పైన నిరంకుశ దాడులు చేస్తుంటే., అదే గీత కార్మిక మహిళలపై కూడా దేవాలయ ప్రవేశాన్ని నిషేధిస్తుంటే చోద్యం చూస్తూ ఉన్నారు. వీటన్నిటిని అరికట్టినప్పుడే కచ్చితంగా మనం సర్వాయి పాపన్కున నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందని పెద్ది వెంకట్రాములు అభిప్రాయపడ్డారు. కోయెడ నరసింహులు మాట్లాడుతూ… బహుజనులంతా ఏకమై సర్వాయి పాపన్న జన్మదిన స్ఫూర్తితో భహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని భహుజనులను కోరారు. భవిష్యత్తులో మరిన్ని పోరాటలకు సిద్ధం కావాలని గౌడగీత కార్మికులకు, బహుజనులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు కోయడ నర్సింలు, ఎస్ శేఖర్ గౌడ్, నాగగౌడ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad