Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeసినిమాయూనిక్‌ కాన్సెప్ట్‌తో 'హే భగవాన్‌'

యూనిక్‌ కాన్సెప్ట్‌తో ‘హే భగవాన్‌’

- Advertisement -

సుహాస్‌ హీరోగా నూతన దర్శకుడు గోపి అచ్చర దర్శకత్వంలో ఓ కొత్త ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. త్రిశూల్‌ విజనరీ స్టూడియోస్‌ బ్యానర్‌పై బి. నరేంద్ర రెడ్డి దీన్ని నిర్మిస్తున్నారు. ఇది వారి ప్రొడక్షన్‌ నెం.2. ‘రైటర్‌ పద్మభూషణ్‌’ ఫేం షణ్ముక ప్రశాంత్‌ ఈ కథను రాశారు.
సుహాస్‌ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్‌ ఈ చిత్ర టైటిల్‌ టీజర్‌ను లాంచ్‌ చేశారు. ఈ చిత్రానికి ‘హే భగవాన్‌!’ అనే టైటిల్‌ పెట్టారు.
టైటిల్‌ గ్లింప్స్‌ లాంచ్‌ ఈవెంట్‌లో హీరో సుహాస్‌ మాట్లాడుతూ,’ఈ సినిమాలో సుదర్శన్‌ నా ఫ్రెండ్‌ క్యారెక్టర్‌ చేశాడు. మా ఇద్దరి కాంబినేషన్‌ చాలా అద్భుతంగా వచ్చింది. శివానితో వర్క్‌ చేయడం రెండోసారి. ఈ సినిమాతో మరింత మంచి పేరు వస్తుంది. ప్రశాంత్‌ ఈ సినిమాకి అద్భుతమైన కథ ఇచ్చాడు. డైరెక్టర్‌ గోపి ‘కలర్‌ ఫోటో’, ‘రైటర్‌ పద్మభూషణ్‌’కి కూడా పనిచేశారు. ఈ సినిమాతో తను డైరెక్టర్‌గా డెబ్యూ అవుతున్నారు. కచ్చితంగా మంచి హిట్‌ కొడతాం’ అని తెలిపారు. ‘సుహాస్‌తో నాకు ఇది సెకండ్‌ ఫిల్మ్‌. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్‌’ అని హీరోయిన్‌ శివాని చెప్పారు. ‘ఈ సినిమాలో మంచి ఫాదర్‌, సన్‌ ఎమోషన్‌ ఉంటుంది’ అని డైరెక్టర్‌ గోపి అచ్చర అన్నారు.
వంశీ నందిపాటి మాట్లాడుతూ, ‘ఈ సినిమాతో సుహాస్‌ను 2.0 చూస్తారు. ఓ మంచి యూనిక్‌ కథతో వస్తున్న సినిమా ఇది. తప్పకుండా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad