‘సినిమా బండి’ ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల ‘పరదా’ అనే మరో ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించారు.
ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజరు డొంకడ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈనెల 22న థియేటర్స్‌లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ, ‘డైరెక్టర్ ప్రవీణ్ చాలా ప్యాషన్‌తో ఈ సినిమా తీశారు. నిర్మాతలు విజరు, శ్రీధర్ ఎన్ని అడ్డంకులు వచ్చినా రాజీ పడకుండా అద్భుతంగా నిర్మించారు. చిరంజీవి బర్త్డే నేపథ్యంలో ఈనెల 22న ఈ సినిమా థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది. నా కెరీర్ లోనే బెస్ట్ ఫిలిం ఇది. ఈనెల 22న మీరు కూడా అదే చెప్తారని నమ్మకం నాకుంది. మీరు సినిమా చూడండి. నచ్చితే ఫ్రెండ్స్‌కి సజెస్ట్ చేయండి. రివ్యూస్ చూసే థియేటర్స్‌కి వెళ్ళండి. మీకు తప్పకుండా సినిమా నచ్చుతుంది’ అని అన్నారు.
‘ఇది చాలా మంచి ఫిలిం. తెలుగులో విమెన్ సెంట్రిక్ ఫిలిమ్స్ చాలా తక్కువగా వస్తాయి. ఈ సినిమా సక్సెస్ అయితే ఇలాంటి మరెన్నో సినిమాలు వస్తాయి. మీరందరూ ఫ్యామిలీతో కలిసి వెళ్లి ఈ సినిమా చూడండి. అనుపమ, సంగీత, దర్శన అద్భుతమైన పెర్ఫార్మన్స్ చేశారు’ అని డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల చెప్పారు. ప్రొడ్యూసర్ విజరు మాట్లాడుతూ,’నాకు 100% నమ్మకం ఉంది. ఈ సినిమా కంటెంట్ మీ అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.
‘ఈ సినిమా ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయదు. ఈ సినిమా మీ అందరినీ అన్ని రకాలుగా అల్లరిస్తుంది. ఇది పది సంవత్సరాలు పాటు మాట్లాడుకునే సినిమా అవుతుంది’ అని మరో ప్రొడ్యూసర్ శ్రీధర్ చెప్పారు.
‘పరదా’ రిలీజ్‌కి రెడీ
- Advertisement -
- Advertisement -