Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంహలో..హలో

హలో..హలో

- Advertisement -

‘ఉక్రెయిన్‌’పై కీలక పరిణామాల వేళ ప్రధాని మోడీకి పుతిన్‌ ఫోన్‌
న్యూఢిల్లీ:
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సోమవారం ప్రధాని మోడీకి ఫోన్‌ చేశారు. ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపు ప్రయత్నాల్లో భాగంగా ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో అలాస్కా వేదికగా జరిగిన సమావేశానికి సంబంధించిన వివరాలను పంచుకున్నారు. ప్రధాని మోడీ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.”డోనాల్డ్‌ ట్రంప్‌తో అలాస్కా భేటీకి సంబంధించిన వివరాలను పంచుకున్నందుకు పుతిన్‌కు ధన్యవాదాలు. ఉక్రెయిన్‌ వివాదాన్ని శాంతియుతంగానే పరిష్కరించుకోవాలని భారత్‌ మొదటినుంచి కోరుకుంటోంది. ఈ విషయంలో అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇస్తాం” అని ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు.ప్రధాని మోడీ, పుతిన్‌లు మాట్లాడుకోవడం పది రోజుల్లో ఇది రెండోసారి. ఈ నెల 8న కూడా ఇరునేతలు ఫోన్‌లో సంభాషించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు సంబంధించి తాజా పరిస్థితులను మోడీకి పుతిన్‌ వివరించినట్టు తెలిసింది. ఈ సంక్షోభం ముగింపునకు శాంతియుత చర్చలే పరిష్కార మార్గమని భారత్‌ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసినట్టు పీఎంవో వెల్లడించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad