– ఇజ్రాయిల్ దురహంకార దాడుల్ని ఖండించాలని డిమాండ్
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
పాలస్తీనాపై ఇజ్రాయిల్ దురహంకార దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలంటూ సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో పెద్దఎత్తున పాలస్తీనా సంఘీభావ, శాంతి ర్యాలీ నిర్వహించారు. ప్రయివేట్‌్ స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు, సీపీఐ(ఎం), సీపీఐ మాస్‌లైన్, న్యూ డెమోక్రసీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ఇజ్రాయిల్ దాడులను అరబ్ దేశాలు ఖండించకపోవడం దారుణమని, ఇప్పటికైనా ఐక్యరాజ్య సమితి తీర్మానానికి కట్టుబడి దాడులు ఆపాలని సామాజిక కార్యకర్త దేవి, ఉలేమాలు మౌలానా ఏ హసాన్‌ఉద్దీన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నల్లగొండ గడియారం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సభలో నిర్వాహకులు ఉలేమాలు, మత పెద్దలు మాట్లాడారు. పాలస్తీనా, ఇజ్రాయిల్ ఘర్షణలకు కారణాలు ఏవైనా కావచ్చు.. రెండు పక్షాలకూ తమవైన రాజకీయ కారణాలు ఏవైనా ఉండొచ్చు.. చిన్నారులేం నేరం చేసారన్నది ప్రశ్న, మహిళలేం పాపం చేశారని ప్రశ్నించారు. ఈ దౌర్జన్యం వల్ల గాజాలో నీరు, విద్యుత్, ఆహారం, ఔషధాల కొరత తీవ్రమైందని, ఆస్పత్రులు, పాఠశాలలు ధ్వంసమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాడులను ప్రపంచదేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. అనంతరం కలెక్టర్ ఇలాత్రిపాఠికి వినతిపత్రం అందజేశారు.
నల్లగొండలో పాలస్తీనా సంఘీభావ ర్యాలీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES