ఫొటో జర్నలిస్ట్ కేశవులుకు అరుదైన గౌరవం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఫొటో జర్నలిస్టు కేశవులుకు అరుదైన గౌరవం లభించింది. ఆయన తీసిన వార్తా ఫొటోలపై పరిశోధన చేసి ప్రత్యేక గ్రంధాన్ని డాక్టర్ సత్యవోలు సుందరసాయి రచించారు. నాలుగు దశాబ్దాల కాలంలో కేశవులు అనేక రకాల ఫొటోలను తీసి ప్రజల ముందు ఉంచారు. చాలా ఫొటోలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా మానవత్వం, పేదరికంపై ఆయన తీసిన ఫొటోలు అనేక అవార్డుల్ని గెలుచుకున్నాయి. సమాజ హితం, లౌక్యం, రాజకీయం, వ్యంగ్యం, విమర్శ, విషాదం, హాస్యం ఇలా తనదైన శైలిలో ఫొటోలను నిక్షిప్తం చేశారు. వృత్తిపట్ల అంకితభావం, ప్రతిభ, సమాజం పట్ల బాధ్యతను ఆయన తన ఛాయా చిత్రాల ద్వారా ప్రజలకు పరిచయం చేశారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ‘సృజనభారతి’ సంస్థ ఆధ్వర్యాన మంగళవారం రవీంద్రభారతిలో సాయంత్రం ఆరు గంటలకు ‘మౌన సాక్ష్యాలు’ గ్రంధాన్ని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా గ్రంధ రచయిత డాక్టర్ సత్యవోలు సుందరసాయి మాట్లాడుతూ కేశవులు తీసిన న్యూస్ ఫొటోలు ఫొటో జర్నలిజానికి మార్గదర్శకంగా నిలవాలనే సంకల్పంతో ఈ పుస్తకాన్ని రాసినట్టు తెలిపారు.
నేడు ‘మౌనసాక్ష్యాలు’ గ్రంధావిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES