Thursday, May 22, 2025
Homeతెలంగాణ రౌండప్వీడీసీలను రద్దు చేయాలి..

వీడీసీలను రద్దు చేయాలి..

- Advertisement -

తాలరాంపూర్ సంఘటన మరువకముందే ఇంకా ఆగని విడిసిల అరాచకాలు 
పట్టించుకోని అధికారులు, ప్రభుత్వం
కళ్ళు గీత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ కోయేడి నర్సింహులు  గౌడ్
నవతెలంగాణ – కంఠేశ్వర్ : తాళ్ల రాంపూర్ గౌడ గీత కుటుంబాల బహిష్కరణ, ఈతవనం దగ్ధం, మహిళ గౌడ ఆలయ అవమానం మరవకముందే గ్రామాలలో వీడీసీల బెదిరింపులు ఆగకపోవడం విచారకరమని, వీడీసీల ఆగడాలపై చర్యలు తీసుకోవడంలో అధికారులు ప్రభుత్వం చూపడం బాధాకరమని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ కోయేడి నరసింహులు గౌడ్ విచారణ వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం నగరంలోని జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వీడిసిలను నిషేధించాలని, వారి ఆగడాలను అరికట్టాలని బహుజన, వృత్తి, ప్రజా సంఘాలు అన్నీ కలిసి ఉద్యమాలు పోరాటాలు చేసినా.. వీడిసిల ఆగడాలు మాత్రం ఇంకా పెరుగుతూనే ఉన్నాయని అన్నారు. తాళ్ళరాంపూర్ సంఘటన అనంతరం చెంగల్ కల్దుర్కి తగ్గేల్లి తదితర మండలాల్లో వేలాది ఈత వనాలను దగ్ధం చేయడం అలాగే అంకాపూర్, కోటా ఆర్మూర్ గంగాసాగర్, మాక్లూరు బోర్గాంల లో వీడీసీ ల బహిష్కరణలు, బెదిరింపులు మాత్రం ఆగడం లేదు. గీతా కార్మికులకు జీవనాధారమైన ఈతవానల దహనంతో జీవనోపాధిని కోల్పోయి తల్లాడిల్లుతున్న గీతన్నలు ఒక దిక్కు, స్వాతంత్రం సిద్ధించి ఇన్ని సంవత్సరాలైనా సాంఘిక దురాచారాలైన బహిష్కరణల పర్వం పెత్తందార్ల పోకడలు వీడీసీల రూపంలు మరో ప్రక్క కొనసాగడం, వీటి పట్ల పోలీస్ వ్యవస్థ ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడంతో బడుగు బలహీన, దళిత వృత్తి దారులు బానిస వ్యవస్థలో ఉన్నామనిపిస్తుంది అని కోయేడి నర్సింహులు గౌడ్ అన్నారు. కుల, బీసి, వృత్తి దళిత గిరిజన సంఘాలాన్ని కలసి ఈ సమస్యలపై ఏసీపీ, జిల్లా కలెక్టర్, ఆర్డీఓకు, అలాగే రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లిన వీడిసి ఆగడాలు ఆగడం లేదు. ఇప్పటికైనా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, దగ్ధమైన ఈతవనాలకు నష్టపరిహారం ఇవ్వాలని చట్టావ్యారేక ఆగడాలకు పాల్పాడే విడిసిలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశం లో కల్లు గీత కార్మిక సంఘము జిల్లా నాయకులు శ్రీరాంగౌడ్, శేఖర్ గౌడ్, కిషన్ గౌడ్, తాళ్ళ శ్రీనివాసగౌడ్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -