- Advertisement -
– ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలు
నవతెలంగాణ – చర్ల
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా భోపాల్‌పట్నం పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఉల్లూర్ సమీప అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందు పాతర పేలి ఓ జవాన్ ప్రాణం కోల్పోయారు. ముగ్గురు డీఆర్‌జీ సైనికులు తీవ్రంగా గాయపడ్డారని జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. మరణించిన డీఆర్‌జీ జవాన్ దినేష్‌నాగ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. బస్తర్ ఐజి సుందర్‌రాజ్, పోలీసు అధికారి కమ్లోచన్ కశ్యప్, పోలీసు అధికారులు నివాళి అర్పించారు. జవాన్ కుటుంబాన్ని ఓదార్చారు. అన్ని విధాలుగా సహాయం చేస్తామని భరోసా ఇచ్చారు. గాయపడిన జవాన్లకు చికిత్స కొనసాగుతోంది.
- Advertisement -