– దరఖాస్తులపై తక్షణం న్యాయం చేయాలి : ఐటీడీఏ సహాయ ప్రాజెక్ట్ అధికారి జనరల్ డేవిడ్ రాజ్
నవతెలంగాణ – భద్రాచలం
ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు గిరిజనులకు అందించడంతోపాటు తమ సమస్యలను గిరిజన దర్బార్లో విన్నవించడానికి వచ్చే ప్రతి దరఖాస్తుదారునికీ న్యాయం జరిగేలా సంబంధిత యూనిట్ అధికారులు కృషి చేయాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనుల నుంచి డేవిడ్ రాజ్ సమక్షంలో అర్జీలు స్వీకరించారు. తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి, మిగతా వాటిని సంబంధిత అధికారులకు అప్పగించారు. గిరిజనుల పోడు భూముల పట్టాలు, పేర్లు మార్పు, రైతుబంధు రుణాలు, వ్యక్తిగత సమస్యలు, భూ సమస్యలు, పై చదువులకు ఆర్థిక సహాయం తదితర సమస్యలపై అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏవో సున్నం రాంబాబు, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ హరీష్, ఎస్‌ఓ భాస్కర్, కొండరెడ్ల అధికారి రాజారావు, ఏపీఓ పవర్ వేణు, డీటీఆర్‌ఓ ఎఫ్‌ఆర్ లక్ష్మీనారాయణ, ఉద్యానవనాధికారి ఉదరు కుమార్, మేనేజర్ ఆదినారాయణ, డీడీ ట్రైబల్ వెల్ఫేర్ పర్యవేక్షకురాలు ప్రమీల బారు, హెచ్‌ఈఓ లింగా నాయక్, గురుకులం ఏవో నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలు గిరిజనులకు అందాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES