నవతెలంగాణ – వలిగొండ రూరల్
చెరువు కాల్వలో చేపలు పట్టబోయి యువకుడు గల్లంతైన ఘటన మండలంలోని వెల్వర్తిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోత్కూర్ మండలంలోని పాలడుగుకు చెందిన శివరాత్రి నవీన్ (21) సోమవారం తన మిత్రులతో కలిసి వెలువర్తి శివారులోని చెరువు కాల్వలో చేపల వేటకు వచ్చారు. నవీన్ సోమవారం సాయంత్రం చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారీ కాలువలో పడిపోయి వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ప్రమాదాన్ని గమనించిన మిత్రులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు నవీన్ ఆచూకీ లభ్యం కాలేదని ఎస్సై యూగందర్ తెలిపారు.
చేపలు పట్టబోయి యువకుడు గల్లంతు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES