నవతెలంగాణ – కోరుట్ల: కోరుట్ల పట్టణ బండపల్లి 30 వార్డులో గత కొద్దిరోజుల కురుస్తున్న భారీ వర్షాల వలన రెండు ఇండ్లు కూలిపోయాయి. ఇంటి యజమానులు ఎండి అమిరుద్దీన్ ఎండి లతీఫ్ అప్రమత్తంగా ఉండడం వలన ప్రమాదం తప్పింది. అట్టి కూలిన ఇండ్లను కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు, తహసిల్దార్ కృష్ణమోహన్, కమిషనర్ రవీందర్ కలిసి సందర్శించారు. తక్షణ ఆర్థిక సహాయాన్ని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వపరంగా అన్ని విధాల ఆదుకుంటామని ప్రభుత్వం ద్వారా తక్షణ సహాయం కింద 1 లక్ష 20 వేల అందజేయాలని తాహాసిల్దార్ కమిషనర్ లను కోరారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి నర్సింగరావుతో పాటు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
వర్షాలకు కూలిన రెండు ఇండ్లు.. తప్పిన పెను ప్రమాదం..సందర్శించిన జువ్వాడి నర్సింగ్ రావు
- Advertisement -
- Advertisement -