Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంముంబైలో కుండ‌పోత‌..మ‌రోసారి రెడ్ అల‌ర్ట్ జారీ

ముంబైలో కుండ‌పోత‌..మ‌రోసారి రెడ్ అల‌ర్ట్ జారీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ముంబైని వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ముంబై నగరానికి భారత వాతావరణ శాఖ (ఐఎండి) మంగళవారం రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ముంబై, థానే, పాల్గర్‌ జిల్లాల్లో కురిసిన భారీ వర్షానికి నేడు స్కూళ్లను, కాలేజీలను మూసివేయాలని విద్యాశాఖా మంత్రి దాదాజీ భూసే అధికారులను ఆదేశించారు. అలాగే నేడు ముంబైలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు బృహాన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బిఎంసి), జిల్లా విపత్తు నిర్వహణ శాఖ సెలవు ప్రకటించింది. అలాగే ఇంటి నుంచే పనిచేయాలని బిఎంసి ప్రైవేటు ఉద్యోగులను కోరింది.

ముంబైలో 6-8 గంటల్లో 177 మి.మీ వర్షం కురిసింది. కుండపోత వర్షాలు కురిసే నేపథ్యంలో పౌరులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీష్‌ సూచించారు. ముంబై రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణం అనుకూలించని నేపథ్యంలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇండియాగో యాప్‌ అండ్‌ వెబ్‌సైట్‌ ద్వారా.. విమాన రాకపోలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాలని ఆ విమాన కంపెనీ ప్రయాణీకులకు సూచించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad