బురదమయంగా ఆర్వోబీ రోడ్డు..
జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలోనే..
పట్టించుకోని సంబంధిత అధికారులు
నవతెలంగాణ – డిచ్ పల్లి
అడుగుకో.. గుంత.. దీన్ని పట్టించుకునేది ఎవరనే ప్రశ్న ఉదయిస్తుంది. చిన్న పని నుంచి మొదలుకొని, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు అన్ని జిల్లా కేంద్రంలో ఉండడంతో ప్రతి పనికి ఈ రైల్వే గేట్ నుండే ఎక్కువ సంఖ్యలో ప్రజలు వెళ్లక తప్పడం లేదు. డిచ్ పల్లి మండలంలోని మాధవనగర్ ఆర్వోబీ వంతెనకు ఇరువైపులా వరద నీరు నిలిచి బురద మయంగా మారి, పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ద్విచక్ర వాహనాల నుండి మొదలుకొని కార్ల వరకు గుంతలో పడి కొన్ని నిమిషాల పాటు ఆగక తప్పడం లేదు. జిల్లా కేంద్రానికి కుత వేటు దూరంలోనే ఆర్ఓబి ఉండడంతో మండల ,జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి అధికారుల రాకపోకలు సైతం ఇక్కడి నుండే కోనసాగుతున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో చిన్న పాటి గుంత పేద్దదై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచి పోతున్నాయి.
ఆ గుంతల నిండ నీరు నిలిచి, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కరంగా మారింది. గుంతలు కనిపించక ద్విచక్ర వాహన దారులు అందులో పడి గాయాలపాలవుతున్నారు. ఆర్వోబీ వంతెన నిర్మాణ పనులు నెమ్మెదిగా సాగడం.. ఇరువైపులా ఉన్న తాత్కాలిక రోడ్డును అధికారులు పట్టించుకోక పోవడంతో గుంతలు ఏర్పడి ప్రయాణికులకు, ఆస్పత్రులకు వేల్లే వారికి తివ్ర ఇబ్బందులు ఎదుర్కొంటునే రాకపోకలు చేయక తప్పడం లేదు. దాని పక్కనుంచి బైపాస్ రోడ్డు గుండ కంఠేశ్వర్ వరకు బస్సులు ,లారీలు, కార్లు వెళ్తున్నాయి. దూర భారం వల్ల ద్విచక్ర వాహనాలు, కార్లు కంఠేశ్వర్ వైపు వెళ్లకుండా మాధవ నగర్ నుండే ఎక్కువ సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నారు.
దీంతోపాటు ప్రతి అరగంటలోపు ఒకసారి గేటు పడడంతో వాహనాలు బారులు తీరుతున్నాయి. దింతో ఏమి చేయాలో అర్థం కాకుండా ఇబ్బందులు పడుతు రాకపోకలు సాగించుకుంటున్నారు. గుంతల్లో వాహనాలు ఆగిపోయి ఇతర వాహనదారులకు తలనోప్పులు తచ్చి పేలుతున్నాయి. కోన్ని సందర్భాల్లో ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి.అసలు ఇంతకీ ఈ రహదారి ఏ శాఖ పరిధిలో వస్తుందో ఏ శాఖ అధికారులు పట్టించుకుంటారో తెలియని పరిస్థితి నేలకోని ఉందని పలువురు వాహన దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంత తెలిసిన అదికారులు చూసి చూడనట్లు వివరించడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ఆర్ ఓ బి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాటలు కలిగి ఉన్నాయి. పనులు సైతం మందకోడిగా సాగడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే వచ్చే ఎన్నికల నాటికి పనులు పూర్తి చేస్తరేమోనని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పనులు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్న పనులు మందకోడిగా సాగడం చేస్తున్న పనులు సైతం పూర్తి కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.ఇకనైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి గేటుకు ఇరువైపులా గుంతల మాయంగా మారిన ఈ రహదారిని సరిచేసి ఇబ్బందులు తలెత్తకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఎంతైనా ఉందని పలువురు పేర్కొంటున్నారు.