Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ గృహ నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీఓ

ఇందిరమ్మ గృహ నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండల కేంద్రంలోని ఇందిరమ్మ గృహ నిర్మాణాలు నిర్మించుకుంటున్న లబ్ధిదారుల నిర్మాణాలను ఎంపీడీవో శ్రీనివాస్ మంగళవారం సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలోని గ్రామాలలో ఇందిరమ్మ పథకంలో మంజూరైన రద్దీగాలు ఇంటి నిర్మాణాలను త్వరిత గతిన నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. గృహ నిర్మాణాలు నిర్మించుకుంటున్న వారికి సంబంధించిన వారి ఖాతాలు డబ్బులను మూడు విడుదలగా జమ చేయుచున్నామని తెలిపారు.

అందుకే మంజురైన వారు ఇంటి నిర్మాణాలు చేపట్టి రాష్ట్రంలోనే జుక్కల్ ఒకటో స్థానంలో ఉండేవిధంగా సహకరించాలని అన్నారు. ప్రస్తుతం జుక్కల్ మండలం కామారెడ్డి జిల్లాలోని గృహ నిర్మాణాలలో నిర్మించడం జుక్కల్ మొదటి స్థానంలో ఉందని జిల్లా అధికారులు గుర్తించారని తెలిపారు. జుక్కల్ మండలం జిల్లాలోని మంచి గుర్తింపు పొందిందని తెలిపారు. నిత్యం లబ్ధిదారుల ఇండ్లను పరిశీలించడం జరుగుతుందని, లబ్ధిదారులకు సూచనలు సలహాలు చేయడం జరుగుతుంది అని అన్నారు . 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad