– మండల అధ్యక్షులు పొద్దుటూరి చంద్రశేఖర్
– పిఆర్ టియుటిఎస్ మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ఉద్యోగ ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని మండల అధ్యక్షులు పొద్దుటూరి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ పిఆర్ టియుటిఎస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సెప్టెంబర్ 1వ తేదీన ఇందిరాపార్క్ హైదరాబాదులో జరుప తలపెట్టిన మహాధర్నా పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆవిష్కరించారు. విజయవంతం చేయాలని PRTU కమ్మర్ పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కమ్మర్ పల్లి జరిగింది.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పొద్దుటూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షన్ హక్కును కాలరాస్తూ సెప్టెంబర్ 1, 2004 నాడు ప్రవేశపెట్టిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులందరూ సెప్టెంబర్ 1వ తేదీన ఇందిరాపార్క్ హైదరాబాదులో జరుప తలపెట్టిన మహాధర్నాకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అంజాద్ సుల్తాన్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, శ్రీనివాసమూర్తి, నాగభూషణం, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాధా కిషన్, రాష్ట్ర కార్యదర్శి నరేష్, మండల అసోసియేట్ అధ్యక్షులు జ్ఞానేశ్వర్, మండల కార్యదర్శి రోహిత్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES